Food
- Feb 04, 2021 , 00:38:29
VIDEOS
సోయా దోశ

కావలసిన పదార్థాలు:
ఇడ్లీ బియ్యం: రెండు కప్పులు, సోయా బీన్స్: ఒక కప్పు, మినుప పప్పు: ఒకటిన్నర కప్పు, మెంతులు: ఒక టీస్పూన్, సెనగపప్పు: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నెయ్యి: కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా సోయా బీన్స్, ఇడ్లీ బియ్యం విడివిడిగా నానబెట్టుకోవాలి. మరొక పాత్రలో మినుప పప్పు, మెంతులు, శనగ పప్పు నానబెట్టాలి. మూడు గంటలపాటు నానిన మినుప పప్పు, మెంతులను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత బియ్యం, సోయాబీన్స్ విడివిడిగా గ్రైండ్ చేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మిశ్రమాన్ని మూడుగంటలపాటు నానబెట్టాలి. తర్వాత పెనంపై కాస్త మందంగా దోశలు వేసుకుంటే సరి. పల్లీ, కొబ్బరి, పుదీనా చట్నీలతో బాగుంటాయి.
తాజావార్తలు
MOST READ
TRENDING