ఆదివారం 07 మార్చి 2021
Food - Jan 30, 2021 , 00:46:45

కొర్ర సలాడ్‌

కొర్ర సలాడ్‌

కావలసిన పదార్థాలు

కొర్రలు: ఒక కప్పు (అరగంట నానబెట్టి అన్నంలా వండుకోవాలి), సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్‌, కీరదోస, టమాటా ముక్కలు: అరకప్పు చొప్పున, ఉల్లికాడల తరుగు: ఒక కప్పు, కొత్తిమీర తరుగు: కొద్దిగా,  ఒక టేబుల్‌ స్పూను, ఆలివ్‌ నూనె: మూడు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు, మిరియాలపొడి: తగినంత 

తయారీ విధానం 

ముందుగా నిమ్మరసం, ఆలివ్‌ నూనె, ఉప్పు, మిరియాల పొడి.. అన్నిటినీ ఓ గిన్నెలోకి వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్న కొర్రలను ఓ గిన్నెలో వేసుకుని, సన్నగా తరిగిన క్యారెట్‌, కీరదోస, టమాటా ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నూనె మిశ్రమాన్ని కలుపుకుని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే కొర్రల సలాడ్‌ రెడీ.


VIDEOS

logo