గురువారం 25 ఫిబ్రవరి 2021
Food - Jan 29, 2021 , 02:28:07

గుమ్మడి ఇడ్లీ

గుమ్మడి ఇడ్లీ

కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ గుజ్జు: రెండు కప్పులు, పచ్చికొబ్బరి తురుము: ఒక కప్పు, బియ్యం రవ్వ: ఒక కప్పు, నూనె: రెండు స్పూన్లు, యాలకుల పొడి: చిటికెడు, ఉప్పు: తగినంత

తయారీ విధానం: బియ్యం రవ్వలో కొన్ని నీళ్లు పోసి మెత్తగా కాకుండా, కాస్త బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తొక్క తీసిన గుమ్మడికాయ ముక్కలను కుక్కర్‌లో వేసి నాలుగు విజిల్స్‌ వచ్చేంత వరకూ ఉడికించి, మెత్తగా మెదపాలి. దీంట్లో బియ్యం రవ్వ, సరిపడా ఉప్పు, యాలకుల పొడి, కొంచెం నీళ్లు వేసుకుని బాగా కలిపి పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌లకు కొద్దిగా నూనె రాసి, ఇడ్లీలు వేసుకుంటే చాలు. కొబ్బరి చట్నీతో ఇవి రుచిగా ఉంటాయి.

VIDEOS

logo