శనివారం 06 మార్చి 2021
Food - Jan 26, 2021 , 01:01:22

అవిసె లడ్డు

అవిసె లడ్డు

కావాల్సిన పదార్థాలు

గోధుమ రవ్వ: అర కప్పు, గోధుమ పిండి: అర కప్పు, అవిసె గింజలు: మూడు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి: ఐదు టేబుల్‌ స్పూన్లు, బెల్లం తురుము: పావు కప్పు, బాదం పిస్తా తురుము: మూడు టీ స్పూన్లు, జాజికాయ పొడి: పావు టీ స్పూన్‌ 

తయారీ విధానం

ముందుగా గోధుమ రవ్వను నాలుగైదు గంటలపాటు నానబెట్టాలి. అవిసె గింజలను తక్కువ మంట మీద దోరగా వేయించి, చల్లారిన తర్వాత పొడి చేయాలి. గోధుమ పిండిని దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు మందపాటి గిన్నెలో నెయ్యి వేసి,  నీటిని వడగట్టిన గోధుమ రవ్వ వేసి రంగు 

మారేంత వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో నెయ్యి, బెల్లం తురుము వేసి.. పాకం వచ్చాక అవిసె గింజల పొడి, వేయించిన గోధుమ రవ్వ, బాదం పిస్తా తురుము వేసి బాగా కలుపాలి. చివరగా గోధుమ పిండి వేసి మిశ్రమాన్ని ఉండల్లా చుట్టుకుంటే సరి.


VIDEOS

logo