ఆదివారం 07 మార్చి 2021
Food - Jan 24, 2021 , 00:36:23

ఓట్స్‌ పరాట

ఓట్స్‌ పరాట

కావాల్సిన పదార్థాలు:

గోధుమపిండి: ముప్పావు కప్పు, ఓట్స్‌: పావుకప్పు, పెరుగు: రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు: తగినంత, ఉల్లికాడల తరుగు: అరకప్పు, ఉల్లిపాయ తరుగు: అరకప్పు, జీలకర్ర: అర స్పూన్‌, పచ్చిమిర్చి పేస్టు: ఒక స్పూన్‌, వెల్లుల్లి ముక్కలు: ఒక స్పూన్‌, నూనె: అరకప్పు.

తయారీ విధానం:

ముందుగా గిన్నెలో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, దోరగా వేయించి మరీ మెత్తగా కాకుండా పొడిచేసిన ఓట్స్‌, పెరుగు తీసుకుని నీళ్లతో చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి జీలకర్రను వేయించుకోవాలి. అందులోనే వెల్లుల్లి ముక్కలూ, పచ్చిమిర్చి పేస్టూ, ఉల్లిపాయ ముక్కలూ, ఉల్లికాడల తరుగూ వేసుకోవాలి. రెండు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు వేసి కలిపి దింపేయాలి. గోధుమపిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. అందులో ఉల్లికాడల మిశ్రమాన్ని ఉంచి, అంచుల్ని మూసేసి పరోటాలా వత్తుకోవాలి. పెనంపై నూనె వేసుకుంటూ రెండువైపులా కాలిస్తే సరి. ఈ పరోటాను ఉల్లిపాయ పెరుగు పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది.


VIDEOS

logo