శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Food - Jan 21, 2021 , 00:03:52

గుమ్మడి పాయసం

గుమ్మడి పాయసం

కావలసిన పదార్థాలు:

గుమ్మడికాయ తురుము: ఒక కప్పు, చిక్కటి పాలు: రెండున్నర కప్పులు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్‌: అర కప్పు, ఏలకుల పొడి: ఒక టీ స్పూను, బెల్లం తరుగు: అర కప్పు, నెయ్యి: టీ స్పూను, పాల పొడి: 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం:

బాణలిలో నెయ్యి వేసుకుని బాదం, జీడిపప్పు, కిస్మిస్‌లను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో పాలు పోసి కొద్దిగా కాగిన తరువాత, గుమ్మడికాయ తురుము వేసి ఉడికించాలి.  బాగా ఉడికిన తర్వాత యాలకుల పొడి, పాలపొడి వేసి మరికాసేపు ఉడికించాలి. ఇప్పుడు బెల్లం తురుము కూడా వేసి , బెల్లం కరిగేంత వరకూ ఆపకుండా కలుపుకోవాలి. బాగా చిక్కబడిన తర్వాత దింపుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ వేసి సర్వ్‌ చేసుకుంటే సరి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. 


VIDEOS

logo