శనివారం 27 ఫిబ్రవరి 2021
Food - Jan 16, 2021 , 00:06:49

ఆరెంజ్‌ జెల్లీ

ఆరెంజ్‌ జెల్లీ

కావాల్సినవి

నారింజ రసం: ఒకటిన్నర కప్పులు, కార్న్‌ఫ్లోర్‌: రెండు టేబుల్‌ స్పూన్లు, చక్కెర పొడి: మూడు టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం: పావు టీ స్పూన్‌, నెయ్యి లేదా నూనె: కొద్దిగా, ఎండు కొబ్బరిపొడి: పావు కప్పు 

తయారీ

ఒక వెడల్పాటి పాన్‌లో నారింజ రసం పోయాలి. అందులోనే చక్కెర పొడి, కార్న్‌ఫ్లోర్‌, నిమ్మరసం వేసి బాగా కలపాలి. దాన్ని స్టవ్‌పై పెట్టి మిశ్రమం చిక్కగా అయ్యేవరకూ కలపాలి. మిశ్రమం అడుగంటకుండా చెంచాతో కలుపుతూనే ఉండాలి. తర్వాత మిశ్రమాన్ని నెయ్యి లేదా నూనె రాసిన ఐస్‌ మౌల్డ్స్‌ లేదా గాజు గ్లాసుల్లో వేయాలి. వాటిని నాలుగైదు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత వాటిని బయటికి తీసి నచ్చిన ఆకారంలో కట్‌ చేసి ఎండు కొబ్బరి

పొడిలో దొర్లించాలి. వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే ఏ సీజన్‌లోనైనా ఆరెంజ్‌ ఫ్లేవర్‌ని టేస్ట్‌ చేయొచ్చు.

VIDEOS

logo