బుధవారం 27 జనవరి 2021
Food - Jan 08, 2021 , 00:03:28

బీట్‌రూట్‌ పూరీ

బీట్‌రూట్‌ పూరీ

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌: ఒకటి, గోధుమ పిండి: పావుకిలో, ఉప్పు: తగినంత, నూనె: డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం: ముందుగా బీట్‌రూట్‌ని శుభ్రంగా కడిగి, తొక్కతీసి ముక్కలుగా చేసుకుని ఉడికించుకోవాలి. ముక్కలు చల్లారాక, మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ పేస్ట్‌లో నీళ్ళుపోసి వడకట్టి, ఆ నీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలో తగినంత ఉప్పు, కొద్దిగా నూనె, సరిపడా బీట్‌రూట్‌ నీళ్లు పోసి కలుపుకోవాలి.  పదిహేను నిమిషాలపాటు పిండిని నానబెట్టాలి. నానిన పిండిని పూరీలా ఒత్తుకుని కాల్చుకుంటే సరి. ఆరోగ్యకరమైన బీట్‌రూట్‌ పూరీ రెడీ. మామూలు పూరీల్లానే వీటినీ రకరకాల కూరలతో వడ్డించవచ్చు.


logo