శనివారం 23 జనవరి 2021
Food - Dec 23, 2020 , 00:49:35

బఠానీ-పుదీనా సూప్‌

బఠానీ-పుదీనా సూప్‌

కావలసిన పదార్థాలు:

పచ్చి బఠానీలు: 2 కప్పులు, వెన్న: 1 టీస్పూన్‌, ఉప్పు: తగినంత, ఉల్లిపాయ: ఒకటి (సన్నగా తరగాలి), పాలు: ఒక కప్పు, తరిగిన పుదీనా: పావు కప్పు, మిరియాల పొడి: అర టీస్పూన్‌

తయారుచేసే విధానం:

ముందుగా స్టవ్‌మీద పాన్‌పెట్టి, వెన్నవేసి కరిగాక ఉల్లిపాయలు దోరగా వేయించాలి. తర్వాత పచ్చి బఠానీలు, ఉప్పు వేసి, తగినన్ని నీళ్ళుపోసి ఉడికించాలి. బఠానీలు మెత్తగా ఉడికిన తర్వాత దింపాలి. చల్లారాక మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. ఇప్పుడు మరో పాన్‌ తీసుకుని ఒక కప్పు నీళ్ళు, పాలు పోసి అందులో పచ్చి బఠానీల పేస్ట్‌ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పెప్పర్‌, తరిగిన పుదీనా వేసి.. మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుతూ తక్కువమంట మీద ఉడికించాలి. కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి, సర్వ్‌ చేసుకుంటే సరి. వేడివేడి బఠానీ-పుదీనా సూప్‌ రెడీ.


logo