మంగళవారం 19 జనవరి 2021
Food - Dec 22, 2020 , 00:03:49

బీట్‌రూట్‌ పలావ్‌

బీట్‌రూట్‌ పలావ్‌

కావలసిన పదార్థాలు

బీట్‌ రూట్‌ తరుగు: ఒక కప్పు, పచ్చి బఠాణీ: ఒక కప్పు, బియ్యం: రెండు కప్పులు, నీళ్లు: నాలుగు కప్పులు, పచ్చిమిర్చి: 4, గరంమసాలా: ఒక టీ స్పూన్‌, ధనియాల పొడి: ఒక టీస్పూన్‌, బిర్యానీ ఆకు: 2, ఉల్లిపాయ:1, జీలకర్ర : పావు టీ స్పూన్‌, యాలకులు: 3, మిరియాలు: పావు టీ స్పూన్‌, జీడిపప్పు: పావుకప్పు, ఉప్పు: తగినంత, నూనె: రెండు స్పూన్లు

తయారీ విధానం:

ముందుగా స్టౌమీద కుక్కర్‌ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, బిర్యానీ ఆకులు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత గరం మసాల, ధనియాలపొడి, యాలకులు, మిరియాలు, జీడిపప్పు వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్‌ చేసిన బీట్‌ రూట్‌, పచ్చి బఠాణీలు వేసి వేగాక బియ్యం, ఉప్పు వేసి, నీళ్లుపోసి మూత పెట్టాలి. రెండు విజిల్స్‌ వచ్చిన తర్వాత, స్టౌ ఆఫ్‌ చేసి ఆవిరి పూర్తిగా తగ్గిన తర్వాత సర్వ్‌ చేసుకుంటే సరి.. వేడివేడి బీట్‌ రూట్‌ పలావ్‌ రెడీ.