సోమవారం 18 జనవరి 2021
Food - Dec 20, 2020 , 00:28:10

మిక్స్‌డ్‌ దాల్‌ దోశ

మిక్స్‌డ్‌ దాల్‌ దోశ

కావాల్సినవి

కందిపప్పు: ఒక కప్పు, 

శనగపప్పు: ఒక కప్పు, 

మినప్పప్పు: ఒక కప్పు, బియ్యప్పిండి: ముప్పావు కప్పు, పచ్చిమిర్చి: రెండు, తురిమిన అల్లం: టీస్పూన్‌, ఇంగువ: చిటికెడు, 

ఉప్పు: తగినంత, 

నూనె: సరిపడ

తయారుచేసే విధానం

ముందుగా పప్పులన్నిటినీ బాగా కడిగి రెండు మూడు గంటలు నానబెట్టాలి. తర్వాత నీళ్లు ఒంపేసి అందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, ఇంగువ వేసి బాగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఉప్పు, బియ్యప్పిండి వేసి తగినన్ని నీళ్లు పోసుకొని దోశ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్లవ్‌ మీద పాన్‌ పెట్టి వేడెక్కాక పిండితో దోశ వేసుకోవాలి. తగినంత నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. మిక్స్‌డ్‌ దాల్‌ దోశలు సిద్ధం.