మంగళవారం 26 జనవరి 2021
Food - Dec 10, 2020 , 00:01:48

క్యాలీఫ్లవర్‌ మిల్క్‌ సూప్‌

క్యాలీఫ్లవర్‌ మిల్క్‌ సూప్‌

కావలసిన పదార్థాలు

సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్‌- పావు కప్పు, బంగాళదుంప తరుగు-పావు కప్పు, ఉల్లి తరుగు-పావు కప్పు, మైదాపిండి-ఒక స్పూన్‌, వెన్న-ఒక స్పూన్‌, పాలు-ఒక కప్పు, పాలమీగడ-ఒక స్పూన్‌, మిరియాల పొడి-ఒక స్పూన్‌, ఉప్పు-తగినంత

తయారీ విధానం

ఒక గిన్నెలో తరిగిన క్యాలీఫ్లవర్‌, బంగాళదుంప, ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, నీళ్ళు పోసి ఉడికించాలి. తర్వాత స్టవ్‌మీద వేరే పాత్ర పెట్టి వెన్న వేసి, కరిగాక అందులో మైదాపిండి వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు అందులో పాలుపోసి ఉండలు లేకుండా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఉడికించుకున్న కూరగాయల్లోని నీటిని వడపోసి.. ఆ నీటిని పాలల్లో పోయాలి. కాస్త ఉడికిన తర్వాత పాలమీగడ వేసి దించాలి. వేడివేడి సూప్‌ని కప్పులో పోసి ఉప్పు, మిరియాలపొడి వేసి సర్వ్‌ చేస్తే సరి. ఇష్టపడేవాళ్ళు పైనుంచి ఉడికిన కూరగాయల ముక్కల్ని కూడా వేసుకోవచ్చు.


logo