మంగళవారం 26 జనవరి 2021
Food - Dec 06, 2020 , 00:06:53

బీట్‌రూట్‌ కోలా

బీట్‌రూట్‌ కోలా

కావాల్సినవి 

బీట్‌రూట్‌ తురుము: ఒకటిన్నర కప్పు, పుట్నాలు: అర కప్పు, సోంపు: ఒక టీ స్పూన్‌, ఉప్పు: తగినంత, ఉల్లిగడ్డ తరుగు: ఒక టేబుల్‌ స్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు: ఐదు, ఎండుమిర్చి: నాలుగు, నూనె: సరిపడా

తయారుచేసే విధానం: ముందుగా బీట్‌రూట్‌ తురుమును గట్టిగా పిండి, ఆ రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మిక్సీ గిన్నెలో పుట్నాలు, ఎండుమిర్చి, సోంపు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిగడ్డ తరుగు వేసి గ్రైండ్‌ చేయాలి. మిశ్రమంలో బీట్‌రూట్‌ రసాన్ని పోసుకొని మెత్తగా చేసుకోవాలి.  ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో బీట్‌రూట్‌ తురుము, ఉల్లిగడ్డ తరుగు, మిక్సీ పట్టిన మిశ్రమం వేసి బాగా కలపాలి. దీనితో చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి. బాణలీలో నూనె వేసి, అది వేడయ్యాక ఈ ఉండలను వేసి డీప్‌ ఫ్రై చేసుకుంటే బీట్‌రూట్‌ కోలా రెడీ.


logo