శనివారం 23 జనవరి 2021
Food - Dec 05, 2020 , 00:26:37

లడ్డూ పరాట

లడ్డూ పరాట

టేస్టీ ఫుడ్‌

కావాల్సినవి  

బూంది లడ్డూలు: ఐదు, గోధుమ పిండి : రెండు కప్పులు, చక్కెర : ఒక టీ స్పూన్‌, నూనె లేదా నెయ్యి : సరిపడా

తయారీ 

ముందుగా లడ్డూలను ఒక గిన్నెలో పొడిగా చేసుకోవాలి. మరోవైపు పెద్ద గిన్నెలో చక్కెర, సరిపడా నీళ్లు పోసి మెత్తగా ముద్ద చేసి కాసేపు పక్కనపెట్టాలి. తర్వాత పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి, చపాతీ కర్రతో రుద్దాలి. వాటి మధ్యలో కొద్దిగా లడ్డూ పొడి పెట్టి, మళ్లీ ఉండలు చేయాలి. వాటిని చేత్తో లేదా కర్రతో వత్తాలి. అలా పిండి మొత్తాన్నీ చేసుకున్నాక, ఆ పరాటాలను నూనె లేదా నెయ్యితో పెనంపై రెండువైపులా కాల్చుకోవాలి. ఈ లడ్డూ పరాటా పంజాబ్‌లో చాలా ఫేమస్‌.logo