గురువారం 28 జనవరి 2021
Food - Nov 29, 2020 , 01:56:52

కొర్రల ఉప్మా

కొర్రల ఉప్మా

కావలసిన పదార్థాలు: అండు కొర్రల రవ్వ: 3 కప్పులు, పచ్చి శనగ పప్పు: ఒక టేబుల్‌ స్పూను, క్యారట్‌ తురుము: పావు కప్పు, టమాటా తరుగు: పావు కప్పు, మినప్పప్పు: ఒక టేబుల్‌ స్పూను, ఉల్లి తరుగు: పావు కప్పు, అల్లం తురుము: ఒక టీ స్పూను, జీలకర్ర: ఒక టీ స్పూను, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: 3, కరివేపాకు: 2 రెబ్బలు, ఆవాలు: ఒక టీ స్పూను, నూనె: రెండు టేబుల్‌ స్పూన్లు

తయారుచేసే విధానం: స్టౌ మీద కడాయి పెట్టి వేడయ్యాక అండుకొర్రల రవ్వను వేసి నూనె వేయకుండా దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే కడాయిలో నూనె వేసి కాగాక మినప్పప్పు, పచ్చి శనగ పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. తరిగిన ఉల్లి, పచ్చి మిర్చి తరుగు, క్యారట్‌ తురుము, టమాటా తరుగు, అల్లం తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. కరివేపాకు వేసి మరోసారి కలియబెట్టాక, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి, మరిగించాలి. వేయించి ఉంచుకున్న రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా మెల్లగా కలుపుతుండాలి. చిన్నమంటమీద బాగా మెత్తబడే వరకు ఉడికించి దింపేయాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అండు కొర్రల ఉప్మా రెడీ.


logo