బుధవారం 20 జనవరి 2021
Food - Nov 25, 2020 , 00:07:57

ఆలూ మెంతికూర

ఆలూ మెంతికూర

ఇమ్యూనిటీ ఫుడ్‌

కావాల్సిన పదార్ధాలు :

ఆలూ : రెండు, నిమ్మ రసం : 2 స్పూన్లు, నూనె : సరిపడా, కారం: 1/2 స్పూన్‌, పసుపు : అర స్పూన్‌, మెంతి కూర: 1 కట్ట, ఉల్లిపాయ : ఒకటి, ఉప్పు : తగినంత, గరం మసాలా : ఒకటిన్నర స్పూన్‌, జీలకర్ర : 1 స్పూన్‌

తయారీ విధానం:

ఆలూను ఉడికించి, పొట్టు తీసి, ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మెంతి కూరను కట్‌ చేసి పెట్టుకోవాలి.  పాన్‌లో నూనె వేడెక్కాక.. జీలకర్ర వేయాలి. అవి బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు మెంతి కూర వేసి మగ్గిన తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి కలిపాలి. కొంతసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఆలూ ముక్కలు వేసి, మూత పెట్టి మరో ఐదు నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. బాగా మగ్గిన తర్వాత గరం మసాలా వేసి, చివర్లో నిమ్మరసం చిలకరించాలి.


logo