గురువారం 03 డిసెంబర్ 2020
Food - Nov 20, 2020 , 00:02:28

కాజూ బాదం పూరీ

కాజూ బాదం పూరీ

కావాల్సిన పదార్థాలు:

బాదంపప్పు: ఒక కప్పు

జీడిపప్పు (కాజూ): అర కప్పు

చక్కెర: ఒక కప్పు, ఇలాచీ పొడి:

 రెండు టీ స్పూన్లు, కుంకుమ పువ్వు: చిటికెడు

పాలు: రెండు టేబుల్‌ స్పూన్లు

నెయ్యి: ఒక టీ స్పూన్‌

తయారుచేసే విధానం: ముందుగా బాదంపప్పును రెండు కప్పుల నీళ్లలో వేసి ఐదారు నిమిషాలు వేడి చేయాలి. తర్వాత వాటి పొట్టు తీసి పక్కన

బెట్టాలి. తడి ఆరాక మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. జీడిపప్పును కూడా మిక్సీలో పొడి చేయాలి. చక్కెరను విడిగా పొడి చేసి పక్కనబెట్టాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో బాదం పప్పు పొడి, జీడిపప్పు పొడి, ఇలాచీ పొడి, చక్కెర పొడి, టీ స్పూన్‌ పాలలో కలిపిన కుంకుమ పువ్వు, నెయ్యి వేసి కలపాలి. తర్వాత పాలు కూడా పోసి ముద్దగా కలపాలి. దాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా (చిన్నసైజు బిళ్లలు) వత్తాలి. వీటిని నూనెలో ఫ్రై చేయకుండా ఒవెన్‌లో బేక్‌ చేసుకుంటే కాజూ బాదం పూరీలు సిద్ధమైనట్టే.