గురువారం 03 డిసెంబర్ 2020
Food - Nov 19, 2020 , 01:14:23

సగ్గుబియ్యం కిచిడి

సగ్గుబియ్యం కిచిడి

కావాల్సినవి: 

సాబుదానా: ఒకటిన్నర కప్పు, పల్లీలు: అరకప్పు, పచ్చి  బఠాణీ: అరకప్పు, పచ్చి మిర్చి: రెండు, నూనె: మూడు చెంచాలు, జీలకర్ర: అర చెంచా, ఆవాలు: పావు చెంచా, పసుపు: పావు చెంచా, ఉప్పు: తగినంత, నిమ్మరసం: చెంచా, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఆలుగడ్డ: ఒకటి, నూనె: తగినంత

తయారీ విధానం

సగ్గుబియ్యాన్ని శుభ్రం చేసుకుని రాత్రే నీళ్లుపోసి నాన బెట్టుకోవాలి. పల్లీలు వేయించుకుని, మిక్సీలో పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆలూ ముక్కలను నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌ ఆన్‌ చేసి, గిన్నె పెట్టుకుని,  నూనె వేసి, వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చి బఠాణీలు వేసి మెత్తగా అయ్యేంత వరకూ మగ్గించుకోవాలి. పచ్చిబఠాణీ బాగా మగ్గిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం, ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలిపి చిన్నమంటమీద పదినిమిషాల పాటు ఉడికించాలి. సగ్గుబియ్యాన్ని ఎక్కువగా ఉడకనివ్వకూడదు. పొడిపొడిగా ఉండగానే దింపి వేయించిన పల్లీల పొడి, ఆలూ ముక్కలు వేసుకుని చివరిగా నిమ్మరసం పిండుకోవాలి. ఇందులో అపార పోషక విలువలు ఉంటాయి.