సోమవారం 18 జనవరి 2021
Food - Nov 15, 2020 , 23:33:19

పెసరపప్పు-క్యారెట్‌ సలాడ్‌

పెసరపప్పు-క్యారెట్‌ సలాడ్‌

కావాల్సినవి

నానబెట్టిన పెసరపప్పు: ఒక కప్పు, క్యారెట్‌ తురుము: రెండు కప్పులు, నూనె: రెండు చెంచాలు, జీలకర్ర: ఒక టీస్పూన్‌, కొబ్బరితురుము: పావు కప్పు, నిమ్మరసం: రెండు టేబుల్‌ స్పూన్లు, మిరియాలపొడి: అర టీస్పూన్‌, చక్కెర: అర టేబుల్‌ స్పూన్‌, అల్లం తరుగు: అర టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం

ముందుగా ఒక గిన్నెలో నిమ్మరసం, మిరియాలపొడి, చక్కెర వేసి బాగా కలపాలి. స్టౌమీద గిన్నె పెట్టి నూనె వేయాలి. వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి వేగనివ్వాలి. తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి అదే గిన్నెలో క్యారెట్‌ తురుము, నానబెట్టిన పెసరపప్పు, కొబ్బరి తురుము, అల్లం తరుగు, ఉప్పు వేసుకొని బాగా కలపాలి. మొదట తయారు చేసుకున్న నిమ్మరసం మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలిపి కొత్తిమీరతో అలంకరించుకోవాలి. పదిహేను నిమిషాలయ్యాక నిమ్మరసం పులుపు పట్టి సలాడ్‌ టేస్టీగా మారిపోతుంది.