శుక్రవారం 15 జనవరి 2021
Food - Nov 04, 2020 , 00:18:05

సజ్జ గట్కా

సజ్జ గట్కా

కావాల్సినవి : 

సజ్జ రవ్వ : రెండు కప్పులు, క్యారెట్‌ తురుము : అర కప్పు, ఆవాలు : అర టీ స్పూన్‌

పచ్చి మిరపకాయలు : ఆరు

కరివేపాకులు : పది రెమ్మలు

నెయ్యి : రెండు టీస్పూన్లు

ఉల్లిపాయ : ఒకటి

ఉప్పు, నూనె : తగినంత

తయారు చేసే విధానం : 

మూకుడులో నెయ్యి వేసుకొని, అందులో సజ్జ రవ్వను దోరగా వేయించుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, నీటితో తడిపి పక్కన పెట్టుకోవాలి. అదే మూకుడులో కొద్దిగా నూనె పోసుకొని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయ ముక్కలు, ఆవాలు, కరివేపాకు రెమ్మలు, క్యారెట్‌ తురుమును వేయించాలి. అందులోనే ఐదు గ్లాసుల నీరు పోసి, ఉప్పు వేయాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడే సజ్జ రవ్వకూడా పోసి, ఉడికించుకోవాలి. అంతే, సజ్జ గట్కా సిద్ధమైపోయినట్లే. చల్లార్చిన తర్వాత పెరుగుతో కలిపి తీసుకుంటే, ఎంతో బాగుంటుంది.