గురువారం 03 డిసెంబర్ 2020
Food - Oct 29, 2020 , 00:07:29

పిండి బేసన్‌ కూర

పిండి బేసన్‌ కూర

కావలసిన పదార్థాలు :

బచ్చలి ఆకులు: రెండు కట్టలు, శనగపిండి: ఒక కప్పు, పచ్చి బఠాణీలు: అర కప్పు, పచ్చి మిరపకాయలు: ఎనిమిది, ఉల్లిపాయ: ఒకటి, సేవ్‌ (సన్నటి కారప్పూస): అర కప్పు , పసుపు: పావు టీస్పూన్‌, కరివేపాకు: రెండు రెమ్మలు , ఉప్పు, నూనె: తగినంత 

తయారుచేసే విధానం:

ముందుగా బచ్చిలి ఆకులను కడిగి తరిగి పెట్టుకోవాలి. శనగపిండిలో పసుపు, రెండు కప్పుల నీరు, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత మూకుడులో నూనె వేసి కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చీల్చిన పచ్చి మిరపకాయలు, కరివేపాకు వేసి, బాగా వేగాక అందులో బచ్చలి ఆకు తరుగు వేయాలి. కొంచెం సేపు కలిపి అందులో ఒక కప్పు నీరు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత శనగపిండి మిశ్రమం, సేవ్‌ వేసి రెండు నిమిషాలు ఉడికించి దించాలి. పిండి బేసన్‌ కూర రెడీ. పూరీ, పుల్కాల్లోకి ఇది చాలా బాగుంటుంది.