గురువారం 03 డిసెంబర్ 2020
Food - Oct 28, 2020 , 00:24:40

రాజ్మా రైస్‌

రాజ్మా రైస్‌

కావాల్సిన పదార్థాలు :

రాజ్మా గింజలు : ఒక కప్పు, 

బియ్యం : మూడు కప్పులు, 

తరిగిన క్యాబేజీ, క్యాప్సికమ్‌ : ఒక్కో కప్పు చొప్పున, 

పచ్చి మిర్చి : ఆరు, 

జీలకర్ర : అర టీ స్పూన్‌,

ఆవాలు : పావు టీ స్పూన్‌, 

తరిగిన కొత్తిమీర : అర కప్పు, 

కరివేపాకు : రెండు రెమ్మలు, 

నిమ్మరసం : ఒక టీ స్పూన్‌, 

నూనె : రెండు టేబుల్‌ స్పూన్లు

పసుపు : చిటికెడు, 

అజినోమోటో : చిటికెడు

ఉప్పు : తగినంత

తయారు చేసే విధానం:

రాజ్మా గింజలను ఒకరోజు ముందుగానే నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఆ గింజలను శుభ్రంగా కడిగి కుక్కర్లో నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. బియ్యాన్ని కూడా పావుగంట సేపు నానబెట్టుకొని, కొద్దిగా ఉప్పువేసి అన్నం వండుకోవాలి. బియ్యం ఉడుకుతుండగానే పావు టీస్పూన్‌ నూనె వేస్తే, అన్నం పొడిగా వస్తుంది. ఆ తర్వాత ఒక మందపాటి మూకుడు తీసుకొని, నూనెపోసి వేడి చేసుకోవాలి. అందులో తరిగిన మిర్చి, జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు, తరిగిన క్యాబేజీ, క్యాప్సికమ్‌, అజినోమోటో వేసుకొని కాసేపు వేయించాలి. ఆ తర్వాత ఉడకబెట్టిన రాజ్మా గింజలు, కాస్తంత ఉప్పువేసి బాగా కలపాలి. మూకుడుపై మూతపెట్టి, సన్నని మంటమీద నాలుగైదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నం అందులో వేసి, బాగా కలుపుకోవాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర వేసి మరోసారి కలుపుకొని దించేయాలి. అంతే, నోరూరించే రాజ్మా రైస్‌ రెడీ!