గురువారం 03 డిసెంబర్ 2020
Food - Oct 27, 2020 , 00:05:27

కందిపప్పు ఫ్రై

కందిపప్పు ఫ్రై

పచ్చి కంది గింజలు: ఒక కప్పు టమాటాలు: మూడు మెంతికూర (తరిగింది): ఒక కప్పు, ఉల్లిపాయ: ఒకటి కారం పొడి: రెండు టీ స్పూన్లు అల్లంవెల్లుల్లి పేస్ట్‌: అర టీస్పూను కరివేపాకు: రెండు రెమ్మలు పసుపు: పావు టీస్పూనుగరం మసాలా: పావు టీస్పూను కొత్తిమీర తురుము: అర కప్పు ఉప్పు, నూనె: తగినంత

తయారుచేసే విధానం

మూకుడులో నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌, మెంతి కూర, కారంపొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత కంది గింజలు, పసుపు, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి. సన్నటి మంటమీద పది నిమిషాలు ఉంచి కొత్తిమీర వేసి దించాలి.