శుక్రవారం 22 జనవరి 2021
Food - Oct 22, 2020 , 23:30:34

మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కిచిడి

మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కిచిడి

కావలసిన పదార్థాలు

బియ్యం: మూడు కప్పులు, కందిపప్పు: ఒక కప్పు, 

పెసరపప్పు: అరకప్పు, టమాటాలు: రెండు, ఆలుగడ్డ: ఒకటి, 

బీన్స్‌: పది, క్యారెట్‌: రెండు, జీలకర్ర: అర టీస్పూన్‌, 

పచ్చిబఠానీలు: పావు కప్పు, దాల్చిన చెక్క: ఒకటి.

షాజీర: పావు టీస్పూన్‌, కరివేపాకు: రెండు రెబ్బలు, 

పసుపు: పావు టీస్పూన్‌, నెయ్యి: పావు కప్పు, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కొద్దిగా, ఎండుమిర్చి: మూడు

తయారు చేసే విధానం

ముందుగా బియ్యాన్ని రెండుసార్లు కడిగి ఆరుకప్పుల నీళ్లుపోసి ఇరవై నిమిషాలు నాననివ్వాలి. తర్వాత కుక్కర్‌లో నెయ్యి వేయాలి. వేడెక్కిన తర్వాత జీలకర్ర, షాజీరా, రెండుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, కరివేపాకు వేయాలి. పెద్దసైజులో తరిగిన కూరగాయ ముక్కలన్నీ వేసి బాగా కలపాలి. నానబెట్టిన కందిపప్పు, పెసరపప్పు, పచ్చిబఠానీలు వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత బియ్యం వేసి తగిన మోతాదులో నీళ్లు పోసి కుక్కర్‌ మూత పెట్టేయాలి. మూడు విజిల్స్‌ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్‌ చేయాలి. ఆవిరంతా పోయిన తర్వాత నెయ్యితో మళ్లీ పోపు పెట్టుకుంటే మరింత రుచిగా ఉంటుంది.


logo