సోమవారం 18 జనవరి 2021
Food - Oct 22, 2020 , 01:25:48

గుమ్మడికాయ బాదం సూప్‌

గుమ్మడికాయ బాదం సూప్‌

కావాల్సిన పదార్థాలు 

ఆలివ్‌ ఆయిల్‌: 2 టేబుల్‌ స్పూన్లు 

గుమ్మడి ముక్కలు: 400 గ్రాములు 

ఉప్పు: అర టీస్పూన్‌ 

నీళ్లు: 2 కప్పులు 

బాదం పలుకులు: 50 గ్రాములు 

తయారుచేసే విధానం 

కడాయిలో ఆలివ్‌ ఆయిల్‌ను పోసి వేడి చేయాలి. గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడిని నూనెలో వేయాలి. రంగు మారే వరకు అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు నీటిని పోసి బాగా కలపాలి. మంట చిన్నగా చేసి మూత పెట్టాలి. 15 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. గుమ్మడి కాయలు బాగా ఉడికించాలి. తర్వాత దీనిని మెత్తటి మిశ్రమంగా చేసుకొని బాదం పలుకులు గార్నిష్‌ చేసుకుంటే ఇమ్యూనిటీని ఇచ్చే గుమ్మడికాయ సూప్‌ రెడీ!