గురువారం 21 జనవరి 2021
Food - Oct 21, 2020 , 00:23:22

బొబ్బర్ల పాయసం

బొబ్బర్ల పాయసం

కావలసిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు: ఒక కప్పు, చిలగడదుంప తురుము: ఒక కప్పు, గోధుమరవ్వ: అరకప్పు, పంచదార: అరకప్పు, పాలు: లీటరు, నెయ్యి: అరకప్పు, పచ్చకర్పూరం: చిటికెడు, యాలకుల పొడి: పావు టీస్పూను

తయారుచేసే విధానం: 

ముందుగా చిలగడదుంప తురుమును, గోధుమరవ్వను వేర్వేరుగా నెయ్యిలో వేయించి పెట్టుకోవాలి. బొబ్బర్లను రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో గోధుమరవ్వ వేసి,  ఒకటిన్నర కప్పు నీరు పోయాలి. అది కాసేపు ఉడికాక అందులో వేడిచేసిన పాలు, చిలగడదుంప తురుము, బొబ్బర్లపిండి, పంచదార వేసి బాగా కలియబెట్టి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివరగా యాలకులపొడి, పచ్చకర్పూరం, నెయ్యి వేసి కలిపి దించాలి. వేడివేడి బొబ్బర్ల పాయసం సిద్ధమైనట్లే.


logo