మంగళవారం 27 అక్టోబర్ 2020
Food - Oct 18, 2020 , 23:29:53

ములక్కాడ ఆవకాయ

ములక్కాడ ఆవకాయ

కావాల్సిన పదార్థాలు 

ములక్కాడలు : 2, ఆవపిండి : 4 టీ స్పూన్లు జీలకర్ర :  అర టీస్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద : 1 టీ స్పూను, కారం : 3 టీ స్పూన్లు , పసుపు : చిటికెడు, ఉడికించిన చింతపండు గుజ్జు : 1 టీ స్పూను, జీలకర్ర, మెంతుల పొడి : 1 టీ స్పూను, 

నూనె : 1 కప్పు, ఉప్పు : తగినంత

తయారు చేసే విధానం

కడాయిలో కప్పు నూనె పోసి.. కాగాక అందులో జీలకర్ర, తరిగిన ములక్కాడ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముక్కలు, ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు వేసి దోరగా వేగాక దింపుకోవాలి. ఈ మిశ్రమం కాస్త చల్లారాక అందులో కారం, జీలకర్ర, మెంతుల పొడి, ఆవాల పొడి కలిపి ఒక పూట ఊరబెట్టి తినవచ్చు.logo