గురువారం 22 అక్టోబర్ 2020
Food - Oct 17, 2020 , 01:19:46

రాజ్మా కిచిడి

రాజ్మా కిచిడి

 కావాల్సిన పదార్థాలు : 

రాజ్మా : కప్పు (కడిగి నానబెట్టాలి), సగ్గు బియ్యం : 2 కప్పులు, 

బంగాళాదుంపలు : 2 (ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కోయాలి), 

వేయించిన వేరుశనగ పప్పు : 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు : 1/2 టీ స్పూను, జీలకర్ర : 1/2 టీ స్పూను, కరివేపాకు : 4 రెబ్బలు, పచ్చిమిర్చి : 2, అల్లం : అంగుళం ముక్క, పసుపు : 1/4 టీ స్పూను, నిమ్మకాయ : 1, 

కొబ్బరి తురుము :  టేబుల్‌ స్పూను, కొత్తిమీర : కట్ట, 

ఉప్పు : తగినంత

తయారు చేసే విధానం:రాజ్మాలో ఒకటింపావు కప్పుల నీళ్లు పోసి సుమారు 6 గంటల సేపు నానబెట్టాలి. తరువాత ఉడికించాలి.  సగ్గుబియ్యం కూడా నానబెట్టి ఉడికించి ఉంచాలి. బంగాళాదుంపల్ని ఉడికించి, పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. పల్లీలను మిక్సీలో వేసి ఓసారి తిప్పి చిన్న ముక్కలుగా చేయాలి. వెడల్పాటి పాన్‌లో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేయాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, పసుపు వేగాక బంగాళాదుంపల ముక్కలు వేసి కలపాలి. సుమారు పావు కప్పు నీళ్లు చిలకరించి మూతపెట్టి స్లిమ్‌లో 5 నిమిషాలు ఉడికించాలి. స్టౌ ఆఫ్‌చేసి వేరుశనగపప్పు, నిమ్మరసం, కొబ్బరి తురుము, కొత్తిమీర కలిపి మూతపెట్టి అలాగే మరో 5 నిమిషాలు వేడిమీద ఉంచాలి.


logo