శుక్రవారం 23 అక్టోబర్ 2020
Food - Oct 15, 2020 , 02:12:28

కంది కిచిడి

కంది కిచిడి

కావలసిన పదార్థాలు

బియ్యం: రెండు కప్పులు

పచ్చి కంది గింజలు: ఒక కప్పు

టమాటాలు: రెండు

ఆలుగడ్డ: ఒకటి

పచ్చిమిరపకాయలు: ఆరు

ఉల్లిపాయ: ఒకటి

జీలకర్ర, షాజీర: అర టీస్పూన్‌

పలావు ఆకులు: రెండు

దాల్చిన చెక్క: ఒకటి

కరివేపాకు: రెండు రెబ్బలు

పసుపు: పావు టీస్పూన్‌

నెయ్యి/ డాల్డా: పావు కప్పు

ఉప్పు: తగినంత

తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని రెండుసార్లు కడిగి నాలుగు కప్పుల నీళ్లు పోసి ఇరవై నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు కుక్కర్‌లో నెయ్యి లేదా డాల్డా వేసి వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, షాజీరా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రెండుగా చీల్చిన పచ్చి మిరపకాయలు, దాల్చిన చెక్క, పలావు ఆకులు, కరివేపాకు, ఆలుగడ్డ ముక్కలు, పచ్చి కంది గింజలు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి. చివరగా నీటితో బియ్యం వేసి బాగా కలిపి కుక్కర్‌ మూత పెట్టేయాలి. మూడు విజిల్స్‌ తర్వాత వేడి వేడి కంది కిచిడి సిద్ధమైపోతుంది.logo