శుక్రవారం 30 అక్టోబర్ 2020
Food - Oct 13, 2020 , 23:39:54

పనీర్‌ నగ్గౌట్స్‌

పనీర్‌ నగ్గౌట్స్‌

కావలసిన పదార్థాలు

పనీర్‌ : 200 గ్రా.

బ్రెడ్‌ ముక్కలు : నాలుగు

అల్లం ముద్ద: అర టీస్పూన్‌

వెల్లుల్లి ముద్ద: అర టీస్పూన్‌

మిరియాల పొడి : ఒకటిన్నర టీస్పూన్‌ 

కారం: ఒక టీ స్పూన్‌

నిమ్మకాయ: సగం

మక్కజొన్న పిండి: అరకప్పు

మైదా పిండి: రెండు టీస్పూన్లు

కొత్తిమీర: ఒక కప్పు (తరిగినది)

నూనె: రెండు కప్పులు

ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేసే విధానం

ఒక పెద్ద గిన్నె తీసుకొని, అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, కారం, ఒక టీస్పూన్‌ మిరియాల పొడితోపాటు రుచికి సరిపడా ఉప్పు, తరిగిన కొత్తిమీర వేసి నిమ్మకాయ రసం పిండాలి.  అందులోనే పనీర్‌ ముక్కలు వేసి ఈ మిశ్రమం ముక్కలకు బాగా పట్టేలా కలిపి, ఓ 30 నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా బ్రెడ్‌ ముక్కలను చిన్నగా కట్‌ చేసి, మిక్సీలో వేసుకొని పొడి చేయాలి. ఒక పెనంలో నూనె పోసి, బ్రెడ్‌ పొడిని గోధుమ రంగులోకి వచ్చేదాకా వేయించి పక్కనుంచాలి. ఇప్పుడు మరో గిన్నెను తీసుకొని, అందులో మక్కజొన్న పిండి, మైదా పిండి, అరచెంచా మిరియాల పొడిని వేయాలి. చిటికెడు ఉప్పు, కొన్ని నీళ్లు పొసి, ఉండలు రాకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కడాయిలో నూనెను వేడి చేసుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్న పనీర్‌ ముక్కలు ఒక్కొక్కటీ తీసుకుంటూ, పిండి మిశ్రమంలో ముంచుతూ, వేయించిన బ్రెడ్‌ పొడిలో అటూ ఇటూ దొర్లించాలి. ఆ తర్వాత పనీర్‌ ముక్కలను కడాయిలో వేసి, బంగారు రంగులోకి వచ్చేదాకా వేయించుకోవాలి. అంతే, వేడివేడి పనీర్‌ నగ్గౌట్స్‌ సిద్ధం. వీటిని టమాటా సాస్‌తో కలిపి తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి.