శుక్రవారం 30 అక్టోబర్ 2020
Food - Oct 12, 2020 , 23:37:55

ఉలవలతో కారప్పొడి

ఉలవలతో కారప్పొడి

ఉలవల్లో  పోషక విలువలు అపారం. కానీ చాలామంది వాటితో చారు మాత్రమే చేసుకుంటారు.  ఉలవల కారప్పొడి కూడా కమ్మగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు

ఉలవలు: ఒక కప్పు

ఎండుమిర్చి: ఎనిమిది

పుట్నాలు: అరకప్పు

వేయించిన జీలకర్ర: ఒక టీస్పూన్‌

ధనియాలు: ఒక టీస్పూన్‌

కరివేపాకు: నాలుగు రెబ్బలు

వెల్లుల్లి: ఆరు రేకులు

ఉప్పు, నూనె: తగినంత

తయారు చేసుకునే విధానం

ఉలవలను ఉడికించి, నూనె లేకుండా మూకుడులో వేయించి పెట్టుకోవాలి. తర్వాత మూకుడులో కాస్త నూనె వేసి, ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉలవలు, పుట్నాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు.. అన్నీ కలిపి పొడిచేసుకోవాలి. ఈ మిశ్రమానికి తడి తగులకుండా భద్రపరుచుకుంటే నెలరోజుల వరకు నిలువ ఉంటుంది.