సోమవారం 18 జనవరి 2021
Food - Oct 04, 2020 , 00:32:11

బిళ్లల పులుసు

బిళ్లల పులుసు

కావాల్సిన పదార్థాలు

శనగపిండి: ఒకటిన్నర కప్పు

ఉల్లిగడ్డ (తరిగి): 1, పచ్చిమిర్చి: 5

నూనె: అర కప్పు, చింతపండు రసం: రెండు కప్పులు

జీలకర్ర: ఒక టేబుల్‌ స్పూను

ధనియాలు: ఒక టేబుల్‌ స్పూను

మెంతులు: పావు టేబుల్‌స్పూను

పసుపు: అర టీస్పూను, ధనియాలపొడి: అర టీస్పూను

బెల్లం: కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌: అర టీస్పూను

కరివేపాకు: రెండు రెబ్బలు

కారం, ఉప్పు: తగినంత

తయారీ విధానం: 

ముందుగా జీలకర్ర, ధనియాలు, మెంతులు వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి వేసి అందులో ధనియాలపొడి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా ముద్ద చేసుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి బిళ్లల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి బాగా వేగనివ్వాలి. ఇందాక ఒత్తుకున్న బిళ్లలు అందులో వేయాలి. తర్వాత చింతపండు రసం పోయాలి. జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడిని వేయాలి. కొద్దిగా కారం, ఉప్పు, బెల్లం వేసి నెమ్మదిగా కలపాలి. బిళ్లలు బాగా ఉడికే వరకు ఉంచాలి. నూనె పైకి తేలి పులుసు దగ్గరగా వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్‌ చేయాలి. రుచికరమైన బిళ్లల పులుసు సిద్ధం.