బుధవారం 27 జనవరి 2021
Food - Oct 03, 2020 , 00:21:54

పనీర్‌ కుల్చా

పనీర్‌ కుల్చా

కావాల్సిన పదార్థాలు :

మైదా : 2 కప్పులు, వంట సోడా : 1/4 టీస్పూన్‌, బేకింగ్‌ పౌడర్‌ : 1/2 టీ స్పూన్‌, చక్కెర : 1 టీ స్పూన్‌, వెన్న : 2 టేబుల్‌ స్పూన్లు, పెరుగు : 1/4 కప్పు, గోరువెచ్చని పాలు : 1/2 కప్పు, పనీర్‌ తురుము : 1 కప్పు,  ఉల్లిపాయ : 1, 

పచ్చిమిర్చి : 3, కొత్తిమీర తరుగు : 2 టీ స్పూన్లు, గరంమసాల : 1/4 టీ స్పూను, నూనె : 1/4 టీ స్పూను, ఉప్పు : తగినంత

తయారు చేసే విధానం :

కడాయిలో టీస్పూన్‌ వెన్న వేసి ఉల్లి, పచ్చిమిర్చి, పనీర్‌ తురుములను వేగించాక 1/2 టీస్పూన్‌ ఉప్పు, కొత్తిమీర, గరంమసాల కలిపి దించేయాలి. తరువాత ఒక గిన్నెలో మైదా, 1/2 టీ స్పూను ఉప్పు, టేబుల్‌ స్పూను వెన్న, బేకింగ్‌ పౌడర్‌, వంటసోడా, పెరుగు, చక్కెర వేసి, గోరువెచ్చని పాలతో కలిపి చపాతీ ముద్ద తయారు చేసుకోవాలి. దానికి నూనె రాసి, 3 గంటలు మూతపెట్టి నానబెట్టాలి. తరువాత నిమ్మకాయంత సైజులో ఉండలు చేసి మధ్యలో పనీర్‌ మిశ్రమం ఉంచి కాస్త మందంగా చపాతీలు చేసుకోవాలి. ఈ చపాతీలను తవా ఫ్రై చేసుకోవాలి.


logo