బుధవారం 20 జనవరి 2021
Food - Oct 01, 2020 , 03:09:44

ఉలవ రసం

ఉలవ రసం

కావాల్సిన పదార్థాలు 

(300-400 మిల్లీ లీటర్ల రసానికి)

ఉడకబెట్టిన ఉలవలు : 60 గ్రా.

చింతపండు లేదా నిమ్మరసం : 20 గ్రా.

టమాటాలు : ఒకటి, కరివేపాకు : 5 లేదా 6

వెల్లుల్లి పేస్టు : 2 టీ స్పూన్లు, మిరియాలు, జీలకర్ర పేస్టు : 2 టీ స్పూన్లు, ఆవాలు : 1 టీస్పూన్‌

ఉప్పు : రుచికి తగినంత, వంట నూనె : 5 మి.లీ.

తయారు చేసే విధానం :

ఉలవలను 4 గంటల పాటు నానబెట్టాలి. ఆవిరి ద్వారా ఉడకబెట్టి చల్లార్చాలి. తర్వాత ఒక టీ స్పూన్‌ నూనె, ఆవాలు, కరివేపాకు, మిరపకాయలు కడాయిలో వేయించాలి. తర్వాత తరిగిన టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. రెండు టీ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్‌ వేసి చింతపండు, ఉప్పు జోడించి మరిగించాలి. బెల్లం, నల్లమిరియాలు, జీలకర్ర, నిమ్మరసం, కరివేపాకు.. ఇష్టముంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడకబెట్టిన ఉలవలు ఆ మిశ్రమానికి జోడించాలి. దీన్ని వడకట్టి రసం తీసి వేడిగా వడ్డించుకోవాలి. ఇందులో పోషక విలువలు అపారం.


logo