శుక్రవారం 30 అక్టోబర్ 2020
Food - Sep 30, 2020 , 00:35:05

కొత్తిమీర పులిహోర

కొత్తిమీర పులిహోర

కావల్సిన పదార్థాలు

కొత్తిమీర కట్ట : ఒకటి

బియ్యం : ఒకటిన్నర కప్పులు

పచ్చిమిర్చి : ఐదు

ఎండుమిర్చి : మూడు

శనగ పప్పు : ఒక టేబుల్‌ స్పూన్‌

మినప పప్పు : ఒక టేబుల్‌ స్పూన్‌

పల్లీలు : రెండు టేబుల్‌ స్పూన్లు

చింతపండు గుజ్జు : 

మూడు టేబుల్‌ స్పూన్లు

జీలకర్ర : ఒక టీస్పూన్‌

ఆవాలు : ఒక టీస్పూన్‌

పసుపు : అర టీస్పూన్‌

నూనె : నాలుగు టేబుల్‌ స్పూన్లు

ఉప్పు : రుచికి సరిపడా

తయారు చేసే విధానం 

బియ్యాన్ని కడిగి, మామూలు అన్నంలాగే వండుకోవాలి. ఆ తర్వాత అన్నాన్ని వెడల్పాటి గిన్నెలో వేసి, మెతుకులుగా విడగొట్టాలి. కొత్తిమీర, పచ్చిమిర్చిని బాగా కడిగి, నీళ్లు లేకుండా కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక మూకుడులో నూనె పోసి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప పప్పు, పల్లీలు, ఎండుమిర్చి వేసుకొని వేయించాలి. బాగా వేగిన తర్వాత పసుపు, చింతపండు గుజ్జు, కొత్తిమీర ముద్ద, ఉప్పు వేసి కలపాలి. మూకుడు అంచుల్లో నూనె తేలేవరకూ ఈ మిశ్రమాన్ని వేయించాలి. ఆ తర్వాత విడగొట్టిన అన్నాన్ని ఇందులో వేసి, బాగా కలుపుకోవాలి. అంతే, వేడివేడి కొత్తిమీర పులిహోర రెడీ. ఒకవేళ పులుపు తక్కువగా ఉంటే నిమ్మకాయ రసాన్ని పిండుకుంటే సరిపోతుంది.