గురువారం 03 డిసెంబర్ 2020
Food - Sep 25, 2020 , 00:25:12

మునగాకు చాట్‌ (ఇమ్యూనిటీ ఫుడ్‌)

మునగాకు చాట్‌ (ఇమ్యూనిటీ ఫుడ్‌)

కావాల్సిన పదార్థాలు

  • మునగాకులు: కప్పు
  • పల్లీలు: అర కప్పు
  • పచ్చిమిర్చి: 2
  • ఆలుగడ్డలు: 2
  • క్యారెట్‌: 1
  • నిమ్మరసం: 1 స్పూన్‌
  • చింతపండు గుజ్జు: 2 టీ స్పూన్లు
  • చాట్‌ మసాలా: 1 స్పూను
  • నూనె, ఉప్పు: తగినంత
  • కొత్తిమీర తురుము: అర కప్పు

తయారు చేసే విధానం

కడాయిలో నూనె వేసి మునగాకులను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో పల్లీలు కూడా వేయించాలి. ఒక పాత్రలో ఉడికించిన ఆలు గడ్డలు, పల్లీలు, క్యారెట్‌ తురుము, చాట్‌ మసాలా, చింతపండు గుజ్జు, నిమ్మరసం, కొత్తిమీర.. అన్నీ వేయాలి. ఈ మిశ్రమంలో వేయించిన మునగ ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు వేయాలి. వీటన్నిటినీ కలిపి పైన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇష్టమైతే గడ్డ పెరుగు, దానిమ్మ గింజలతో అలంకరిస్తే బాగుంటుంది.