శుక్రవారం 22 జనవరి 2021
Food - Sep 23, 2020 , 00:49:48

లెమన్‌ ఓట్స్‌

లెమన్‌ ఓట్స్‌

కావాల్సిన పదార్థాలు 

ఓట్స్‌ - 3 కప్పులు

నీళ్లు - కప్పు

వేరుశనగలు - 2 స్పూన్లు

నిమ్మరసం - 2 స్పూన్లు

ఆవాలు - టేబుల్‌ స్పూను

జీలకర్ర - టేబుల్‌ స్పూను

పచ్చి శనగపప్పు - 2 స్పూన్లు

పచ్చిమిరపకాయలు - 3

కరివేపాకు - కొద్దిగా

ఇంగువ - చిటికెడు

నూనె, ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం 

మందపాటి గిన్నె లేదా కడాయిలో తగినంత నూనె వేసి కాగిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుశనగ పప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు.. అన్నీ వేసి వేయించుకొని నీరు పోసి, ఉప్పు వేసి తెర్లనివ్వాలి. నీరు తెర్లుతున్న సమయంలో ఓట్స్‌ వేసి ఉడికించాలి. దించే ముందు నిమ్మరసం జత చేయాలి.


logo