మంగళవారం 26 జనవరి 2021
Food - Sep 22, 2020 , 01:02:47

ఇమ్యూనిటీ ఫుడ్‌ గోధుమ పిండి హల్వా

ఇమ్యూనిటీ ఫుడ్‌ గోధుమ పిండి హల్వా

కావాల్సిన పదార్థాలు 

గోధుమపిండి: 1 కప్పు, చక్కెర: ఒకటిన్నర కప్పు

నెయ్యి: అర కప్పు, కాజు: కొద్దిగా

తయారు చేసే విధానం: 

ముందుగా గోధుమపిండిని చపాతీ ముద్దలా చేసుకొని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. పిండి ముద్ద మునిగే వరకు అందులో నీళ్లు పోయాలి. మూడు గంటల తర్వాత పిండి మెత్తగా పిసకాలి. అప్పుడు నీళ్లు పాలలా తెల్లగా మారుతాయి. ఆ నీటిని మరో గిన్నెలోకి ఒంపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో నీటిని పోసి, ఒక కప్పు చెక్కర వేసి పాకం పట్టాలి. మరో స్టౌపై గిన్నె ఉంచి కారామిల్‌ కోసం చెక్కర, నీళ్లు పోసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. చెక్కర కరిగిన తర్వాత స్టౌ ఆఫ్‌ చేయాలి. ఇందాకటి పాకాన్ని చిన్నమంటపై ఉంచి అందులో ఈ కారామిల్‌ను కలపాలి. పాకాన్ని వేడి చేస్తూ గోధుమ పిండి నుంచి వేరు చేసిన పాలను కొద్దికొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి. గోధుమపిండి పాలు, నెయ్యి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి. నెమ్మదిగా పాకం చిక్కబడుతుంటుంది. బాగా దగ్గరికి వచ్చాక నెయ్యి వేసి, కాజూతో అలంకరించుకోవాలి. అదిరిపోయే సువాసన వచ్చే గోధుమపిండి హల్వా సిద్ధమైపోతుంది.


logo