Food
- Sep 18, 2020 , 03:27:47
ఇమ్యూనిటీ ఫుడ్ మసాలా చేపల కూర

కావాల్సిన పదార్థాలు
- చేపలు: అర కేజీ, ఆవాలు: టీ స్పూను
- నూనె: పావు కప్పు, ఉల్లిపాయ: 1, టమాటాలు: 2, చింతపండు: కొద్దిగా
- గరం మసాలా : 1 టీ స్పూను
- ఉప్పు, పసుపు, కరివేపాకు: తగినంత
- (మసాలా కోసం)
- నూనె: 1 టేబుల్ స్పూను
- ఎండుమిర్చి: 10, ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు: ఒక కప్పు, తాజా కొబ్బరి: అరకప్పు
తయారు చేసే విధానం:
చింతపండును 10 నిమిషాలు నీటిలో నానబెట్టిన తర్వాత గుజ్జు రసాన్ని తీసి పక్కనపెట్టుకోవాలి. ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, ధనియాలు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసుకొని ముద్దలా చేసుకోవాలి. దానికి కొబ్బరి కలిపి పక్కన పెట్టుకోవాలి. మళ్లీ ప్యాన్లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు వేయాలి. తర్వాత టమాట ముక్కలు వేసి వేగనివ్వాలి. అందులో మసాలాను వేయాలి. తర్వాత నీరు, చింతపండు రసం కూడా వేసి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత నూనె పైకి తేలుతున్నప్పుడు చేపల ముక్కల్ని వేయాలి. మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. చివర్లో గరం మసాలా పౌడర్ చల్లి వేడి వేడిగా వడ్డిస్తే రుచికరంగా ఉంటుంది.
తాజావార్తలు
- 1988 తర్వాత.. గబ్బా కోట బద్దలు
- అమ్మో! సూది మందా? నాకు భయ్యం..
- గోదావరికి వాయనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
- అత్యద్భుత సిరీస్ విజయాల్లో ఇదీ ఒకటి: సచిన్
- టీమిండియా విజయంపై ప్రధాని మోదీ ప్రశంసలు
- రకుల్ జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
- రిషబ్ పంత్ సూపర్ షో..
- ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన టీమిండియా
- కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ డిశ్చార్జి
- ఖుషీ కపూర్ ఎంట్రీపై బోనీ కపూర్ క్లారిటీ..!
MOST READ
TRENDING