మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Food - Sep 16, 2020 , 00:16:50

ఇమ్యూనిటీ ఫుడ్‌ మటన్‌ కుర్మా

ఇమ్యూనిటీ ఫుడ్‌ మటన్‌ కుర్మా

కావాల్సిన పదార్థాలు

నూనె: అర కప్పు, ఉల్లిపాయ: 1, మటన్‌: ముప్పావు కేజీ, పెరుగు: 4 టీస్పూన్లు, నీళ్లు:1 కప్పు, ధనియాల పొడి: 2 టీ స్పూన్లు, కారం: 1 టీస్పూను, అల్లంవెల్లుల్లి పేస్ట్‌: 2 టీ స్పూన్లు, లవంగాలు: 4, యాలకులు: 2, దాల్చిన చెక్క: 3 అంగుళాల ముక్క, వేగించిన ఉల్లిపాయ ముక్కలు: 2 టీ స్పూన్లు, ఉప్పు: తగినంత

తయారు చేసే విధానం: 

ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగిన తర్వాత మటన్‌, పెరుగు, ఉప్పు, నీళ్లు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి. కొద్దిసేపటి తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి సన్నని మంటపై అరగంట సేపు ఉడికించాలి. తర్వాత వేగించుకున్న ఉల్లిపాయలు వేసి మటన్‌ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. మటన్‌ కుర్మా రెడీ. దీన్ని రొట్టెతో తింటే చాలా రుచిగా ఉంటుంది.


logo