బుధవారం 30 సెప్టెంబర్ 2020
Food - Sep 15, 2020 , 00:11:41

ఇమ్యూనిటీ ఫుడ్‌ మునగాకు రోటి పచ్చడి

ఇమ్యూనిటీ ఫుడ్‌ మునగాకు రోటి పచ్చడి

కావాల్సిన పదార్థాలు

మునగాకు: అర కప్పు, క్యాప్సికం: 2, టమాటాలు: 2, చింతపండు: కొద్దిగా, బెల్లం: అర టీస్పూను, పచ్చిమిర్చి: ఐదారు, ఆవాలు: అర టీస్పూను, మెంతులు: పావు టీ స్పూను, మినప్పప్పు: టీ స్పూను, కొబ్బరి: చిన్న ముక్క, ఎండుమిర్చి: 4, ఇంగువ: చిటికెడు, నూనె: పావు కప్పు, ఉప్పు: తగినంత

తయారు చేసే విధానం: 

ఒక పాత్రలో కొద్దిగా నూనె వేడి చేసి మినప్పప్పు, ఆవాలు, మెంతులు వేయించి తరువాత ఎండుమిర్చి, ఇంగువ వేయాలి. 2 నిమిషాల తరువాత ఈ తాలింపుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే పాత్రలో కొద్దిగా నూనె వేడి చేసి క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, మునగాకు, చింతపండు, బెల్లం వేసి మగ్గించాలి. మునగాకులోని పచ్చివాసన పోయాక దింపేయాలి. మునగాకు మిశ్రమాన్ని రోట్లోకి తీసుకొని, కొబ్బరి, ఇందాక పక్కన పెట్టుకున్న తాలింపు, తగినంత ఉప్పు వేసి మెత్తగా నూరుకుంటే సరిపోతుంది. కమ్మని పచ్చడి సిద్ధం.



logo