బుధవారం 30 సెప్టెంబర్ 2020
Food - Sep 14, 2020 , 04:59:41

బ్రౌన్‌ రైస్‌ దోశ

బ్రౌన్‌ రైస్‌ దోశ

కావాల్సిన పదార్థాలు :

బ్రౌన్‌ రైస్‌ : కప్పు

మినప్పప్పు : కప్పు

కందిపప్పు : అర కప్పు

పెసరపప్పు : అర కప్పు

శనగపప్పు : అర కప్పు

అటుకులు : ఒక కప్పు

మెంతులు : ఒక టీస్పూను

నూనె : తగినంత

ఉప్పు : తగినంత

తయారు చేసే విధానం :

మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పులను ముందు రోజు రాత్రి నానబెట్టాలి. అలాగే బియ్యం, అటుకులను కూడా నానబెట్టుకోవాలి. తెల్లవారి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. పిండి పులవాలి అనుకున్నవారు పిండిని సుమారు 3 లేదా 4 గంటలపాటు రూమ్‌ టెంపరేచర్‌లో పెట్టాలి. ఆ తరువాత దోశలు పోసుకోవాలి.logo