బుధవారం 30 సెప్టెంబర్ 2020
Food - Sep 13, 2020 , 00:33:56

ఫిష్‌ కోకోనట్‌ కర్రీ

ఫిష్‌ కోకోనట్‌ కర్రీ

కావాల్సిన పదార్థాలు:

చేప ముక్కలు : అర కేజీ, కొబ్బరిపాలు : అర కప్పు

టమాట గుజ్జు : కప్పు, 

ఉల్లిపాయలు : రెండు

అల్లం తరుగు : టీ స్పూను, వెల్లుల్లి తరుగు : టీ స్పూను, పచ్చిమిర్చి : ఆరు, కరివేపాకు : రెండు రెబ్బలు, ఆవాలు, మెంతులు : టీ స్పూను చొప్పున

పసుపు : పావు టీ స్పూను

కారం, ధనియాల పొడి : టీ స్పూను చొప్పున

నీళ్లు : కప్పు, నూనె : 2 టేబుల్‌ స్పూన్లు

ఉప్పు : తగినంత 

తయారు చేసే విధానం: 

కడాయిలో ఆవాలు, మెంతులు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు (సగం), పసుపు, కారం, ధనియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేగనివ్వాలి. తర్వాత టమాట గుజ్జు కలపాలి. కాసేపయ్యాక చేప ముక్కలు వేసి నీళ్లు పోయాలి. ముక్కలు ముప్పావు భాగం ఉడికిన తర్వాత కొబ్బరిపాలు, ఉప్పు వేసి సన్నని మంటపై ఉంచాలి. కూర చిక్కబడ్డాక స్టౌ ఆఫ్‌ చేసి మిగిలిన కరివేపాకు వేసి కొద్దిసేపు మూతపెట్టి ఉంచాలి.


logo