శుక్రవారం 22 జనవరి 2021
Food - Sep 12, 2020 , 00:34:41

మొఘలాయి కాలీఫ్లవర్‌

మొఘలాయి కాలీఫ్లవర్‌

కావాల్సిన పదార్థాలు -

కాలీఫ్లవర్‌ (మీడియం) : ఒకటి

ఆలుగడ్డలు : పావు కిలో

పచ్చి బఠాణీలు : 200 గ్రా.

ఉల్లిపాయలు : రెండు

నెయ్యి : 2 టేబుల్‌ స్పూన్లు

కుంకుమ పువ్వు : అర టీస్పూను

పెరుగు : టేబుల్‌ స్పూను

ఉప్పు: తగినంత

మసాలా ముద్ద కోసం :

ధనియాలు : టేబుల్‌ స్పూను

అల్లం : చిన్న ముక్క

లవంగాలు : ఆరు

కశ్మీరీ మిర్చి : ఎనిమిది

తయారు చేసే విధానం: కాలీఫ్లవర్‌, ఆలుగడ్డలను ముక్కలుగా కోసుకోవాలి. ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా, రెండో ఉల్లిపాయను ముక్కలుగాను తరగాలి. బౌల్‌లో నెయ్యి వేసి ముక్కలుగా కోసిన ఉల్లివేసి వేయించి, ముద్దలా నూరి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బౌల్‌లో నూనె వేసి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిముక్కలు, మసాలా ముద్ద వేసి వేయించాలి. తరువాత ఆలుగడ్డ, కాలీఫ్లవర్‌ ముక్కలు వేసి మూడు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. తరువాత ఉల్లిముద్ద, ఉప్పు, కుంకుమ పువ్వు, పెరుగు వేసి బాగా కలపాలి. మూతపెట్టి 2-3 నిమిషాలపాటు ఉడికించి దించాలి.


logo