పుదీనా చికెన్ కర్రీ

కావాల్సిన పదార్థాలు
చికెన్ : అర కేజీ, పుదీనా ఆకులు : కప్పు, చిక్కటి పెరుగు : ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయలు : రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు : టేబుల్ స్పూను, టమాట గుజ్జు : కప్పు, పచ్చిమిర్చి : ఆరు, నిమ్మరసం : టేబుల్ స్పూను, జీలకర్ర : ఒకటిన్నర స్పూను, దాల్చినచెక్క : అంగుళం ముక్క, యాలకులు : మూడు, కారం : టీ స్పూను, మిరియాల పొడి : టీ స్పూను, ధనియాల పొడి : టీ స్పూను, గరంమసాలా పొడి : టీ స్పూను, నూనె : 3 టేబుల్ స్పూన్లు, పాలు : అర కప్పు, ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం:
చికెన్ ముక్కలకు పెరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, గరం మసాలా, నిమ్మరసం పట్టించి మూతపెట్టి రిఫ్రిజిరేటర్లో 2 గంటలపాటు ఉంచాలి. కడాయిలో నూనె వేసి.. వేడి అయిన తర్వాత అందులో జీలకర్ర, దాల్చినచెక్క, యాలకులు, ఉల్లి తరుగు వేసి వేయించాలి. అందులోనే టమాట గుజ్జు వేసి బాగా కలపాలి. తర్వాత అందులో ఇందాక రిఫ్రిజిరేటర్లో పెట్టిన చికెన్ ముక్కలను అందులో వేసి కలపాలి. 10 నిమిషాలు పెద్ద మంటపై ఉంచి, తర్వాత చిన్న మంట చేసి మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు పుదీనా ఆకులు, ధనియాల పొడి, మిరియాలపొడి, పాలు కలిపి 10 నిమిషాలు ఉడికించి దించేయాలి. పుదీనా పరిమళంతో ఘుమఘుమలాడే చికెన్ రెడీ.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్‌కు.. లేదంటే గెహ్లాట్‌కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్