గురువారం 21 జనవరి 2021
Food - Sep 03, 2020 , 02:58:42

మటన్‌ డ్రమ్‌స్టిక్స్‌ దాల్చా

మటన్‌ డ్రమ్‌స్టిక్స్‌ దాల్చా

కావాల్సిన పదార్థాలు :

మటన్‌ : కిలో, ఎర్ర కందిపప్పు : 100 గ్రా., శనగపప్పు : 50 గ్రా., ఆవాలు : టీ స్పూను, లవంగాలు : 4, దాల్చిన చెక్క : 2, వెల్లుల్లిపాయ : ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు : టీ స్పూను, కరివేపాకు : 2 రెబ్బలు, ఎండుమిర్చి : 10 , మునగకాయలు : 2, పుదీనా తురుము : 2 టీస్పూన్లు, మామిడికాయ పొడి : 2 టీస్పూన్లు, కారం, పసుపు : టీ స్పూను చొప్పున, నెయ్యి : 50 గ్రా., మటన్‌ స్టాక్‌ : లీటరు. నూనె : తగినంత, ఉప్పు : తగినంత

తయారు చేసే విధానం :

మటన్‌ ముక్కల్ని నీళ్లు పోసి సగం ఉడికేవరకు ఉంచాలి. తరువాత నీటిని విడిగా తీసి ఉంచాలి. అదే మటన్‌ స్టాక్‌గా వాడాలి. ఎర్ర కందిపప్పు, శనగపప్పు కడిగి ఓ గంటసేపు నానబెట్టాలి. బౌల్‌లో కొద్దిగా నెయ్యి వేసి కాగాక అల్లం వెల్లుల్లి, మటన్‌ ముక్కలు, నానబెట్టిన పప్పులు, మునగకాయ ముక్కలు వేసి వేయించాలి. మటన్‌ స్టాక్‌ పోసి మటన్‌ ముక్కలు పూర్తిగా ఉడికేవరకు ఉంచాలి. మరో బౌల్‌లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఉల్లి ముక్కలు కూడా వేసి వేగాక ఉడికించిన మటన్‌ మిశ్రమాన్ని వేసి కలిపి దించాలి. చివరగా మామిడికాయ పొడి, మిగిలిన నెయ్యి, పుదీనా తురుము వేసి అలంకరించాలి.e


logo