Food
- Aug 30, 2020 , 23:29:15
ఇమ్యూనిటీ ఫుడ్ బాదామి హరియాలి

కావాల్సిన పదార్థాలు :
ఉల్లికాడలు, పచ్చిమిర్చి, బాదం తరుగు : అర కప్పు, అల్లం తరుగు : టీ స్పూను, కొత్తిమీర తరుగు : ముప్పావు కప్పు, మెంతి ఆకులు : అరకప్పు, ఉడికించిన బీన్స్ : కప్పు, పచ్చి బఠాణీ : కప్పు, తాజా క్రీమ్ : టేబుల్ స్పూను, పంచదార : టీ స్పూను, జీలకర్ర పొడి : టీ స్పూను, బిర్యానీ ఆకు : ఒకటి, నూనె : టేబుల్ స్పూను, పన్నీర్ తురుము : కొద్దిగా, ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం :
బాదం తరుగుతో ఉల్లికాడలు (తెల్లని భాగం మాత్రమే),కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తరుగు మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా రుబ్బు కోవాలి. నూనెలో బిర్యానీ ఆకుతోపాటు బాదం పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు చిన్న మంటపై వేగించాలి. ఇప్పుడు మెంతి ఆకులు, పచ్చిబఠాణీ, ఉప్పు, పంచదార, జీలకర్ర పొడిని కలిపి 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత ఉడికించిన బీన్స్, క్రీమ్ వేసి, 5 నిమిషాల తర్వాత పన్నీర్ తురుము చల్లి దించేయాలి. నాన్, పరాటాలతో కలిపి తింటే రుచిగాఉంటుంది.
తాజావార్తలు
- క్షమాపణ సరిపోదు.. అమెజాన్‌ను నిషేధిస్తాం : బీజేపీ
- లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
- రుణయాప్ డైరెక్టర్లు చైనాకు..?
- గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?
- సాయుధ దళాల సేవలు అభినందనీయం
- అడ్డుగా ఉన్నాడనే.. భర్తను హత్య చేసింది
- నగరి ఎమ్మెల్యే రోజా కంటతడి
- నేరాలకు ఎంటర్నెట్
- వరి నాటు వేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- ఆదిపురుష్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్
MOST READ
TRENDING