గురువారం 28 జనవరి 2021
Food - Aug 27, 2020 , 22:51:30

ఇమ్యూనిటీ ఫుడ్‌ మిక్స్‌డ్‌ వెజ్‌ టిక్కా మసాలా

ఇమ్యూనిటీ ఫుడ్‌ మిక్స్‌డ్‌ వెజ్‌ టిక్కా మసాలా

కావలసిన పదార్థాలు:

 • క్యాలీఫ్లవర్‌: 15
 • క్యారెట్‌ ముక్కలు: కప్పు
 • పచ్చి బఠాణీలు:  అర కప్పు
 • ఉల్లిపాయ ముక్కలు: కప్పు
 • టమాటో: ఒకటి
 • జీడిపప్పు: ఎనిమిది
 • కొత్తిమీర: కట్ట
 • అల్లం: అంగుళం ముక్క
 • పచ్చిమిర్చి: రెండు
 • తందూరీ మసాలా పొడి: టీస్పూను
 • గరంమసాలా పొడి: అర టీస్పూను
 • ధనియాల పొడి: టీస్పూను
 • జీలకర్ర పొడి: టీస్పూను
 • పసుపు: అర టీస్పూను
 • చాట్‌మసాలా: అర టీస్పూను
 • వెన్న: కొద్దిగా
 • ఉప్పు, నూనె: తగినంత

తయారు చేసే విధానం:

టమాటోలు గుజ్జులా చేయాలి. జీడిపప్పు కూడా ముద్దలా చేయాలి. పాన్‌లో నూనె, వెన్నవేసి కాగాక కూరగాయల ముక్కలు అన్నీ వేసి వేయించి దించి పక్కన ఉంచాలి. మరో పాన్‌లో నూనె వేసి కాగాక అల్లం తురుము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉప్పు, పసుపు కూడా చల్లి మసాలా పొడులన్నీ వేసి కలపాలి. ఇప్పుడు రుబ్బిన టమాటో గుజ్జు, జీడిపప్పు ముద్ద కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఉడికించాలి. గ్రేవీ కాస్త దగ్గర పడ్డాక కొత్తిమీర తురుము, వేయించిన కూరగాయల ముక్కలన్నీ వేసి మరికాసేపు ఉడికించి దించాలి.logo