మంగళవారం 26 జనవరి 2021
Food - Aug 24, 2020 , 22:51:17

ఇమ్యూనిటీ ఫుడ్‌

ఇమ్యూనిటీ ఫుడ్‌

కావలసిన పదార్థాలు :

కాజూ : 12, క్యాప్సికం :  ఆరు, ఎరుపు క్యాప్సికం : రెండు, పాలు : అరకప్పు, ఉల్లిపాయలు : మూడు, వెల్లుల్లి రెబ్బలు : 15, పసుపు : టీస్పూను, కారం : టీస్పూను, గరం మసాలా : అర టీస్పూను, జీలకర్ర పొడి : పావు టీ స్పూను, 

గసగసాలు : ముప్పావు టీ స్పూను, కొబ్బరి తురుము : టేబుల్‌ స్పూను, నూనె : పావు కప్పు, ఉప్పు : తగినంత

తయారు చేసే విధానం :

గంట ముందుగా జీడిపప్పు, గసగసాలు నీళ్లలో నానబెట్టుకోవాలి. తరువాత అందులో కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అనంతరం క్యాప్సికం ముక్కలు వేయాలి. పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మూత పెట్టాలి. కాసేపటి తర్వాత పాలు, ముందుగా చేసుకున్న పేస్టు వేసి బాగా కలపాలి. గ్రేవీలా తయారై నూనె వేరవుతుంది. ఇది అన్నంలోకే కాదు రొట్టెల్లోకీ బాగుంటుంది.


logo