శనివారం 23 జనవరి 2021
Food - Aug 20, 2020 , 21:49:20

ఇమ్యూనిటీ ఫుడ్‌ మిక్స్‌డ్‌ వెజ్‌ కర్రీ

 ఇమ్యూనిటీ ఫుడ్‌ మిక్స్‌డ్‌ వెజ్‌ కర్రీ

కావలసిన పదార్థాలు :

 • ఆలుగడ్డ ముక్కలు : కప్పు
 • బీన్స్‌ ముక్కలు : కప్పు
 • పచ్చి బఠాణీలు : అర కప్పు
 • క్యాలీఫ్లవర్‌ ముక్కలు : అర కప్పు
 • క్యారెట్‌ ముక్కలు : కప్పు
 • గుమ్మడికాయ ముక్కలు : కప్పు
 • టమాటా ముక్కలు : కప్పు
 • కొబ్బరి తురుము : రెండు కప్పులు
 • ఎండుమిర్చి : నాలుగు,జీలకర్ర : టీస్పూన్‌, 
 • ధనియాలు : టేబుల్‌ స్పూన్‌, పసుపు : టీ స్పూన్‌, 
 • ఆవాలు : టీస్పూన్‌, మినప్పప్పు : టీ స్పూన్‌, కరివేపాకు : 4 రెబ్బలు, వేరుశనగ నూనె : 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు: తగినంత

తయారు చేసే విధానం :

కప్పు కొబ్బరి తురుములో గోరువెచ్చని నీళ్లు పోసి మెత్తగా రుబ్బి చిక్కని పాలు తీయాలు. తరువాత కాసిన్ని నీళ్లు పోసి మళ్లీ రుబ్బి పలుచని పాలు తీయాలి. చింతపండుని వేడినీళ్లలో నానబెట్టి గుజ్జులా చేయాలి. బౌల్‌లో టీ స్పూన్‌ నూనె వేసి రెండు ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, మిగిలిన కొబ్బరి తురుము వేసి వేయించాలి. తరువాత కొద్దిగా నీళ్లు చల్లి మెత్తగా రుబ్బాలి. కూరగాయల ముక్కలు, తాజా బఠాణీలు అన్నీ కూడా పలుచని కొబ్బరిపాలల్లో ఉడికించాలి. తరువాత అందులోనే ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ముక్కలు మూడు వంతులు ఉడికేవరకూ ఉంచాలి. తరువాత రుబ్బిన మసాలా వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. విడిగా బౌల్‌లో కొద్దిగా నూనె వేసి మిగిలిన ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి పోపు చేసి కూరలో కలపాలి. చివరగా చిక్కని కొబ్బరిపాలు పోసి సిమ్‌లో 2 లేదా 3 నిమిషాలు ఉడికించాలి.logo